Hyderabad | పీవీ ఘాట్ వ‌ద్ద నివాళి

Hyderabad | పీవీ ఘాట్ వ‌ద్ద నివాళి

హాజ‌రైన స్పీకర్, మండలి చైర్మన్

Hyderabad |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమి (పీవీ ఘాట్) వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ పీవీ సమాధి వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దార్శనిక నాయకుడిగా పీవీ నరసింహారావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలు, పరిపాలనా దక్షత భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొని పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.