Rs20 Dispute Murder | సర్దిచెప్పబోయి ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్

Rs20 Dispute Murder | సర్దిచెప్పబోయి ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్

Rs20 Dispute Murder | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో రూ.20 చిల్లర విషయంలో ప్రారంభమైన గొడవ ఓ ట్యాక్సీ డ్రైవర్ ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం… మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఓ కూరగాయల వ్యాపారితో రూ.20 చిల్లర విషయంలో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో అక్కడే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ బెస్త చంద్ర (55) జోక్యం చేసుకుని వారిని సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు.

అయితే ఆగ్రహానికి లోనైన యువకులు చంద్రపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన చంద్ర ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిల్లర వివాదం హత్యకు దారితీయడంతో పాపంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.