పల్స్ పోలియో విజయవంతం, 92 శాతం నమోదు..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసినట్లు ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, ఆర్, మమత, తెలిపారు. మండలంలో పోలియో చుక్కలు వేసేందుకు 22 బూతులు, ప్రయాణికుల పిల్లలకోసం1,మొబైల్ టీం1, ఏర్పాటు చేసి,0,నుండి 5,సంవత్సరాలలోపు పిల్లలకు మండలంలో 2170 మందికి పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు డాక్టర్ తెలిపారు. మండలంలో 92 శాతం పల్స్ పోలియో చుక్కలువేసివిజయవంతమైనట్లు డాక్టర్ మమత తెలిపారు.
