US Iran Conflict | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరింత తీవ్రం
US Iran Conflict | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరింత తీవ్రం
US Iran Conflict | ఇరాన్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు
ట్రంప్ హెచ్చరిక.. మరిన్ని కఠిన చర్యలకు సిద్ధం
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఘాటు స్పందన
US Iran Conflict | వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా శనివారం భీకర దాడులకు దిగింది. ఇరాన్ మిస్సైల్, డ్రోన్ నిల్వ స్థలాలు, తీరప్రాంత రాడార్ సౌకర్యాలపై దాడులు జరిగాయి. ఈ దాడులు సుమారు 90 నిమిషాలు కొనసాగాయి. ఆరు యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు (ఎఫ్-35, ఎఫ్-16) హార్ముజ్ జలసంధి వెంబడి నాలుగు ఇరాన్ సైట్లు, క్వే ద్వీపంపై దాడులు చేశాయి. ఈ దాడులను యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకు యూఎస్ ఇలాంటి చర్య తీసుకుంది. ఇది ఇరాన్ దాడికి బలమైన స్పందన అని యూఎస్ అధికారులు తెలిపారు.
యూఎస్ సైనిక దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థించారు. ఇరాన్ దాడికి బలమైన, సమతుల్య స్పందనగా ఈ చర్యలు జరిగాయని చెప్పారు. ఇరాన్ తన చర్యలు కొనసాగిస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి సురక్షితంగా ఉండాలని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలు యూఎస్-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందాన్ని పరీక్షిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ ఒప్పందం పాటించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే రోజున మరో నౌకపై ఇరాన్ దాడి చేసింది.
హార్ముజ్ జోలికొస్తే ఊరుకోం: ఇరాన్
యూఎస్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. యూఎస్ సైనిక చర్యలు అక్రమమైనవని, సార్వభౌమత్వానికి వ్యతిరేకమని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ భూభాగంపై యూఎస్ దాడులు యుద్ధ నేరాలకు సమానమని ఆరోపించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఈ దాడులకు తగిన స్పందన ఇస్తామని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిలో తన చర్యలు స్వీయ రక్షణ కోసమని, యూఎస్ ఆక్రమణకు ప్రతిస్పందనగా జరిగాయని తెలిపింది.
యూఎస్ దాడులు ఇరాన్ మిస్సైల్, డ్రోన్ సౌకర్యాలపై జరిగినా ఇరాన్ రక్షణ వ్యవస్థలు బలంగా ఉన్నాయని, మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ యూఎస్ చర్యలు ప్రపంచ శాంతికి ముప్పుని తెస్తాయని విమర్శించారు. ఇరాన్ యూఎస్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ చేసిన ఆరోపణలను తిరస్కరించింది. హార్ముజ్ జలసంధి తన భూభాగం సమీపంలో ఉందని, అక్కడ తన రక్షణ చర్యలు చేపట్టే హక్కు ఉందని స్పష్టం చేసింది.
