రేగొండ మండలంలో 96 శాతం పల్స్ పోలియో విజయవంతం..

రేగొండ, ఆంధ్రప్రభ : మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసినట్లు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి. డాక్టర్.హిమబిందు తెలిపారు. మండలంలో పోలియో చుక్కలు వేసేందుకు గ్రామాల్లో 36 బూతులు, రేగొండ మండల కేంద్రంలో ప్రయాణికుల పిల్లలకోసం1,మొబైల్ టీం1, ట్రాన్స్కో టీం 02, ఏర్పాటు చేసి,0-నుండి5,సంవత్సరాలలోపు పిల్లలు 4593 మందికి గాను మండలంలో 4367 మందికి పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు డాక్టర్. హిమబిందు తెలిపారు.మండలంలో 96 శాతం పల్స్ పోలియో నమోదైనట్లు డాక్టర్ మబిందు తెలిపారు.