PV Narasimha Rao Jayanti | తెలంగాణ భవన్లో పీవీ జయంతి వేడుకలు
● పీవీ చిత్రపటానికి నివాళులర్పించిన సురభి వాణిదేవి, బీఆర్ఎస్ నేతలు
● మాజీ ప్రధానికి ఘనంగా నివాళులర్పించిన పార్టీ నాయకులు
PV Narasimha Rao Jayanti | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: మాజీ ప్రధాని, భారతరత్న పి.వి. నరసింహారావు జయంతి వేడుకలు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు దేశానికి అందించిన విశిష్ట సేవలను నాయకులు స్మరించుకున్నారు. భారత ఆర్థిక సంస్కరణలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు సుమిత్రానంద్, బాలరాజ్ యాదవ్, కె. కిషోర్ గౌడ్, పల్లె రవికుమార్, ఆజం అలీ, ధర్మేందర్ రెడ్డి, తుంగ బాలు, మమత తదితరులు పాల్గొన్నారు.
