తొర్రూరులో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : నేడు వైశాఖ శుద్ధ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాత జయంతి వేడుకలను పట్టణంలోని సారంగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు చలువాది సత్యనారాయణ, కార్యదర్శి ఉప్పల నాగేశ్వరరావు, కోశాధికారి బోనగిరి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి మాత త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆర్యవైశ్యులు సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తమ విన్నపాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు అభిషేకాలు, వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం, మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొద్దుటూరు గౌరీ శంకర్, పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం నాయకుడు బిజ్జాల అనిల్ కుమార్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గోపారపు రామా ఉపేందర్, జోన్ చైర్మన్ చిదిరాల నవీన్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రాంబాబు, పట్టణ వైశ్య ప్రముఖులు బిజ్జాల నారాయణ, హరిశంకర్, అధ్యక్షుడు చిదిరాల రవి, గోశాల బాధ్యులు దారం కుమారస్వామి, నాళ్ల కృష్ణమూర్తి, మహిళలు సరిత, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
