గృహ గణన సెల్ఫ్ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభించిన కార్పొరేటర్..

గృహ గణన సెల్ఫ్ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభించిన కార్పొరేటర్..
సులభమైన సురక్షితమైన డిజిటల్ సదుపాయం
కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి వెల్లడి
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గృహ గణన సెల్ఫ్ వివరాల నమోదు ప్రక్రియను 34 డివిజన్ శివనగర్ కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి, వార్డ్ ఆఫీసర్ వంశీతో కలిసి ప్రారంభించారు. ఆదివారం శివనగర్ కార్పోరేటర్ కార్యాలయంలో సెల్ఫ్ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభించిన అనంతరం కార్పోరేటర్ మాట్లాడుతూ ఇది అధికారిక పోర్టల్ ఎస్ ఈ సి ఈ ఎన్ ఎస్ యు ఎస్. జి ఓ టి. ఐ ఎన్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబరు ఉపయోగించి ఓటిపి ద్వారా లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకోవచ్చని వెబ్సైట్ సులభమైన సురక్షితమైన డిజిటల్ సదుపాయం కలిగిందని ఆయన అన్నారు ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆయన అన్నారు. కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వంశి, మహిళా నాయకురాలు ఇందిరా, అభిషేక్, రాజు, మధుసూదన్, నూతన్ తదితరులు పాల్గొన్నారు.
