Major Accident | ఆరుగురికి గాయాలు

Major Accident | ఆరుగురికి గాయాలు
Major Accident | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ తెల్లవారుజామున స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్‌కు వెళ్లాల్సిన స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. విమానంలో 232 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ స్లైడ్‌ల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
