కొబ్బరి చెట్టుపై పిడుగు.. తృటిలో తప్పిన ప్రమాదం
కొత్తగూడ, ఆంధ్రప్రభ : వర్షాకాలం ప్రారంభంలోనే ఉరుములు, మెరుపులు జోరందుకున్నాయి. శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిన సందర్భంగా మండలంలోని లాడాయిగడ్డ గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
పిడుగు ఇంటి సమీపంలో పడినప్పటికీ, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదు. అయితే పిడుగు ప్రభావంతో కొబ్బరి చెట్టు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళన చెందారు. వర్షాకాలంలో ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
