దొడ్డు వడ్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వినతి

దొడ్డు వడ్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వినతి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు వడ్లను తరుగు లేకుండా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఇంచార్జి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో కేవలం సన్న రకం ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దొడ్డు రకానికి కోర్రిలు పెడుతున్నారని ఆరోపించారు.

దొడ్డు రకం ధాన్యం కొనాలి అంటే ప్రస్తుతం ఇస్తున్న మూడు కిలోల తరుగుతో పాటు అదనంగా మరో రెండు కిలోలు రైతులు ఇవ్వాలని అయితేనే మిల్లర్లు దొడ్డు వడ్లు దించుకుంటారని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. తరుగు భరిస్తేనే ఏజెన్సీలు కొనుగోలు చేస్తాయని రైతులకు కండిషన్ పెట్టడం దారుణం అన్నారు.

ఐదు కిలోల తరుగు ఎలా తీస్తారని ప్రశ్నించారు. దొడ్డు వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం లో కోరారు. లేకుంటే రైతుల తరపున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బీఆర్ఎస్ నాయకులు బోదిరే నర్సయ్య, నీలం రవి, మూత లింబాద్రి, తదితరులు ఉన్నారు.

Leave a Reply