సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా మేనేజర్

సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా మేనేజర్

–రోగులకు అందుతున్న ఆరోగ్య శ్రీ సేవల పరిశీలన,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ( సిహెచ్ సి ) ను బుధవారం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ , పి ,విక్రమ్, సందర్శించారు. హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రల రికార్డులను పరిశీలించారు. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి పరిశీలించారు. హాస్పటల్లో అదనపు గదులు, కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేయడానికి వీలుగా ఉంటుందా, లేదా అని చూశారు. త్వరలోనే ఏర్పాటు చేయబోయే డయాలసిస్ సెంటర్ కు కావలసిన వసతుల గురించి ఆయన ఆరోగ్యశ్రీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ జిల్లా టీం లీడర్ అనిల్ యామంకి, ఆరోగ్య మిత్రలు రాజమౌళి, స్వప్న దేవిలున్నారు.

Leave a Reply