నిండు జీవితానికి రెండు చుక్కలు
నిండు జీవితానికి రెండు చుక్కలు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : గ్రామంలో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి గ్రామ సర్పంచ్ దిలీప్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పచ్చిక దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని వైద్య అధికారులు తెలిపారు.
