జంగమ సమాజ జిల్లా సమావేశాన్ని విజయవంతం చేయాలి

ఆగస్టు 9న బాన్సువాడలో జిల్లా స్థాయి సమావేశం

జుక్కల్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జంగమ సమాజ సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా జంగమ సమాజ అధ్యక్షుడు ప్రభాకర స్వామి పిలుపునిచ్చారు.

ఆదివారం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్, బిచ్కుంద ప్రాంతాలకు చెందిన జంగమ సమాజ సభ్యులకు జిల్లా సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభాకర స్వామి మాట్లాడుతూ, ఈ నెల 9న బాన్సువాడ పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి జంగమ సమాజ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లాలోని జంగమ సమాజ సభ్యులంతా పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమాజ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జంగమ సమాజ ప్రధాన కార్యదర్శి నాగభూషణం స్వామి, ప్రతినిధులు మహాదేవ స్వామి, ప్రభుదేవ్, సంగాయప్ప స్వామి, శివకాంత్, జంగమ సమాజ సభ్యులు పాల్గొన్నారు.