Yellamma | దేవి పుట్టినరోజున అదిరిపోయే అప్డేట్‌

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: సంగీతంతో కోట్లాది అభిమానులను అలరించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు నటుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘ఎల్లమ్మ’ చిత్రం నుంచి చిత్ర బృందం డీఎస్పీ పోషిస్తున్న పాత్రను పరిచయం చేస్తూ.. ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ సినిమాలో ఆయన ‘పార్షి’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మట్టి మనుషుల జీవితాలతో ముడిపడిన ఈ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందని.. చిత్ర బృందం తెలిపింది. ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన డీఎస్పీ.. ఈ సినిమాతో నటుడిగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.

పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో డీఎస్పీ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆయనను ఇప్పటి వరకు చూడని కొత్త రూపంలో చూపించడంతో పాటు, విన్‌టేజ్‌ లుక్‌లో చేతిలో కిరీటం పట్టుకొని కనిపించారు. పాత్రపై ఆసక్తిని పెంచేలా మేకర్స్ ఈ పోస్టర్‌ డిజైన్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా, డీఎస్పీ పాత్రను పరిచయం చేయడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు బలగం ఫేమ్‌ వేణు యెల్దండి దర్శకత్వం వహించగా.. దిల్‌ రాజు నిర్శిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్ప్ మెప్పించింది. కాగా ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాదే మ్యూజిక్‌ అందించడం విశేషం.