నాటిన మొక్కలే భవిష్యత్ తరాల జీవనాధారం
నాటిన మొక్కలే భవిష్యత్ తరాల జీవనాధారం
- నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి
నర్సంపేట, ఆంధ్రప్రభ : నేడు నాటిన మొక్కలే భవిష్యత్ తరాలకు జీవనాధారంగా నిలుస్తాయని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి అన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ తరాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాబోయే తరాలకు మనం ఇవ్వగల గొప్ప కానుక మొక్కలేనని ఆమె పేర్కొన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, గాలి, నీరు, భూమిని కలుషితం చేయకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గిరిగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్, సంస్థ సభ్యులు వెంకటాచారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
