బాధిత కుటుంబాలకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత

బాధిత కుటుంబాలకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత
- ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి, ఆంధ్రప్రభ : నిరుపేద బాధిత కుటుంబాలకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఎల్లవేళలా చేయూతనిచ్చి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ అధినేత, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలాయపల్లి, మైలారం గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాజు సోమయ్య, గజావెల్లి మల్లికాంబ, గూడూరు బాలరాజు ఇటీవల వివిధ కారణాలతో మరణించారు.
విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి గ్రామానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ అందజేశారు.అనంతరం మైలారం గ్రామంలో డీలర్ అంజయ్య సమీప బంధువు కాంచనపల్లి రేణుక ఇటీవల అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందించి కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, పార్టీ ముఖ్య నాయకులు ఏలే సుందర్, లేతకుల రంగారెడ్డి, సురేందర్ రాథోడ్, బొమ్మినేని సురేందర్ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, దోకుడు దేవేందర్, గుడి యుగేందర్ రెడ్డి, మైబు రెడ్డి, వశపాక మారయ్య, చిన్న యాకయ్య, గట్టు, గజావెల్లి రాజు, వశపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.
