కాలుష్య నివారణకు మొక్కలు నాటాలి…

కాలుష్య నివారణకు మొక్కలు నాటాలి…
బిక్కనూరు, ఆంధ్రప్రభ : కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ చెప్పారు. బుధవారం ఎర్త్ డే ను పురస్కరించుకొని సౌత్ క్యాంపస్లో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన భూమి – మన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే, ప్రత్యామ్నాయ మార్గాలను వాడాలన్నారు.
జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగాధిపతి డాక్టర్ డి. సబితా మాట్లాడుతూ “భూమిని కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడినట్టే” అని అన్నారు. పర్యావరణాన్ని సంరక్షించడం ప్రతి మనిషి కర్తవ్యం అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్, విభాగాధిపతి డాక్టర్ డి. సబితా, డాక్టర్ టీ. ప్రతిజ్ఞ, డాక్టర్ నారాయణ గుప్తా, ఏపిఆర్‌ఓ డా.సరిత పిట్ల, ఉమెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, డాక్టర్ ఇంద్రకరణ్ రెడ్డి, డాక్టర్ కనకయ్య, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, మహిపాల్ విద్యార్థులు పాల్గొన్నారు.
