దేవాలయ నిర్మాణం శుభ పరిణామం..

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ శిలా శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి , జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగడం ఎంతోశుభపరిణామమని తెలిపారు.

ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం అందించే పవిత్ర స్థలంగా మారాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సౌహార్దం, ఐక్యత పెరగాలని కోరుతూ దేవాలయ నిర్మాణానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య జిల్లా నాయకుడు కూర సురేందర్ రెడ్డి సుబ్బక్క పల్లె సర్పంచ్ బొడ్డు రాజేందర్ వెల్లంపల్లి బూత్ అధ్యక్షుడు శివ బండపల్లి ఉపసర్పంచ్ ఆరే అశోక్ మేకల వీరారెడ్డి బూస రాజయ్య తదితరు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply