విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ , విడుదల చేయాలి,

విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ , విడుదల చేయాలి,
జనసేన పార్టీ జిల్లా నాయకులు కంకణాల దేవేందర్,
చిట్యాల, ఆంధ్రప్రభ :రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, సంబంధించిన స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు కంకణాల దేవేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నెలల తరబడి పెండింగ్‌లో ఉండడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితి కారణంగా చదువును కొనసాగించడం కూడా చాలా మందికి కష్టంగా మారిందన్నారు.
ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం నుండి రీయింబర్స్‌మెంట్ ఇంకా రాలేదని చెప్పి విద్యార్థుల నుండి ముందుగానే ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీని వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు , ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను విడుదల చేయాలని, అలాగే ప్రైవేట్ కాలేజీల అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కంకణాల దేవేందర్ కోరారు. నిర్లక్ష్యం చేస్తే జనసేన పార్టీ తరఫున విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
