చేనేత సహకార సంఘం డైరెక్టర్లకు బీఆర్ఎస్ సన్మానం

ఎన్నికైన ప్రతినిధులకు శాలువాలతో ఘన సత్కారం

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ చేనేత సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఉపాధ్యక్షురాలు మంచే పద్మ గోవర్ధన్, కార్యదర్శి మహేశ్వరం మధుసూదన్‌తో పాటు డైరెక్టర్లుగా ఎన్నికైన ఎలగందుల సుజాత, పెండెం రాజారాం, జోగు మచ్చగిరి, జల్ది రవిలను మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోన్నెబోయిన రమేష్, పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కొణతం యాకుబ్ రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సామ పద్మారెడ్డి, జిల్లా నాయకులు మర్రి అనిల్ కుమార్, దాసరి తిరుమలేష్, కూరెళ్ల పరమేష్, దబ్బెటి శైలజ, మంచే గోవర్ధన్, చేతరాశి వెంకన్న, అన్నందాస్ విద్యాసాగర్, కంచర్ల క్రాంతికుమార్ రెడ్డి, మొరిగాల వెంకన్న, ఎలగందుల అమరేందర్, బందెల శ్రీను, మొరిగాల శ్రీను, కొణతం మహేందర్ రెడ్డి, పోన్నెబోయిన మచ్చగిరి, చుక్క అశోక్ తదితరులు పాల్గొన్నారు.