కంఠ మహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఘన ఏర్పాట్లు

కంఠ మహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఘన ఏర్పాట్లు
ఐదు రోజులపాటు పూజా కార్యక్రమాలు – భక్తులకు ఆహ్వానం
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి, లక్ష్మీ తండా, రామారావు తండా గ్రామాల భక్తుల ఆధ్వర్యంలో దేవగౌడ సంఘం నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ కంఠ మహేశ్వరస్వామి, సురమాంబ దేవి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, వన మైసమ్మ దేవతల నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 22 నుండి 26 వరకు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు,వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై పూజల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందాలని దేవగౌడ సంఘం ప్రతినిధులు కోరారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 22న ఉదయం 6 గంటలకు ఎర్రమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి దేవతల విగ్రహాలను మేడపల్లి గ్రామానికి ఘనంగా ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఊరేగింపులో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూలు,జలాలతో స్వాగతం పలకాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
