ఆలేరు ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు,సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని సూచించారు. తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు..
