రేపు నియోజకవర్గ స్థాయి రైతు సదస్సు

రేపు నియోజకవర్గ స్థాయి రైతు సదస్సు
-జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ ఓ ఫంక్షన్ హాల్ లో రేపు( మంగళవారం)నియోజకవర్గ స్థాయి రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ – జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారి ఏ సునీల్ కుమార్ సోమవారం తెలిపారు . ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా,ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు, విస్తీర్ణం పెంపుదల – ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో నియోజక వర్గం రైతులు, పాల్గొని విజయవంతం చేయాలని సునీల్ కుమార్ కోరారు.
