ponnam prabhakar | కోహెడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
ponnam prabhakar | కోహెడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
ponnam prabhakar | హుస్నాబాద్, ఆంధ్రప్రభ : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి సూచించారు. పార్టీ కార్యాలయాలు ప్రజలకు సేవా కేంద్రాలుగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్టి సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల జయరాజ్, మండలంలోని పలువురు సర్పంచ్‌లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
