Haryana Suicide Case | కేసు నమోదు చేసిన పోలీసులు
Haryana Suicide Case | కేసు నమోదు చేసిన పోలీసులు
Haryana Suicide Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హర్యానాలోని ఫరిదాబాద్‌లో రాహుల్ (28) అనే గార్మెంట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. రెండేళ్ల క్రితం జ్యోతి అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్న రాహుల్, ఇటీవల కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం… భార్యతో పాటు అత్త వీణ, మామ బిట్టు, భార్య సోదరి నీతు తనను తరచూ వేధింపులకు గురి చేసేవారని రాహుల్ ఆరోపించినట్లు తెలుస్తోంది. వ్యాపారం చూసుకోవడంతో పాటు ఇంటి పనులు కూడా చేస్తున్నప్పటికీ భార్య తనపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టిందని ఆయన తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వేధింపులు భరించలేక చివరకు తన గార్మెంట్ దుకాణంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తన మరణానికి భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమని రాహుల్ ఆరోపించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, సెల్ఫీ వీడియోతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.
