Us-Iran-Doha-Talks : కాల్సులకు బ్రేక్​ Andhra Prabha Top News

Us-Iran-Doha-Talks : కాల్సులకు బ్రేక్​ Andhra Prabha Top News

  • మళ్లీ చర్చలు
  • మంగళవారం దోహాలో భేటీ
  • హోర్ముజ్​ వదలండి
  • అమెరికా డిమాండు
  • జలసంధి మాదే
  • ఇరాన్​ వెల్లడి
  • ఇజ్రాయెల్​ వెనక్కి వెళ్లాలి
  • హిజ్బుల్లా వార్నింగ్​

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి )

Us-Iran-Doha-Talks : దాడులు, స్రతిదాడులతో హోర్ముజ్​ జలసంధిలో అలజడి సృష్టించిన అమెరికా. ఇరాన్​ తాజాగా.. మళ్లీ శాంతి చర్చలకు తలూపాయి. మంగళవారం టెక్నికల్​ చర్చలకు సిద్ధమువుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా, ఇరాన్ మంగళవారం దోహాలో కీలక చర్చలు జరపనున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని హిజ్బుల్లా ఆరోపించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. హోర్ముజ్ జలసంధిపై తమ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి, దాడులను నిలిపివేసి, మంగళవారం ఖతార్‌లోని దోహాలో చర్చలు జరపడానికి అమెరికా, ఇరాన్‌లు అంగీకరించినట్లు ఆక్సియోస్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధికి పూర్తి బాధ్యత తమదేనని ఇరాన్​ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు. తమ దేశం ఆమోదించిన మార్గం కాకుండా వేరే మార్గాన్ని ఉపయోగించే ఏ ప్రయత్నమైనా “ఉద్రిక్తత ఉధృతికి” దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

ఆదివారం తమ దేశంలోని దక్షిణ ప్రాంతాలలో అనేక దాడులు చేయడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఉల్లంఘించిందని హిజ్బుల్లా ఆరోపించింది. దక్షిణ నగరం నబాటియే సమీపంలోని మైఫాడౌన్ పట్టణంలోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఆ బృందం తెలిపింది.ఫరూన్ పట్టణం బింట్ జ్బెయిల్ జిల్లాలోని బహిరంగ ప్రదేశాలను ఇజ్రాయెల్ డ్రోన్ లక్ష్యంగా చేసుకుందని, తైబే హదాతాలోని నివాస భవనాలపై పేలుళ్లు సంభవించాయని కూడా హిజ్జుల్లా పేర్కొంది. హిజ్బుల్లాతో పోరాటం శాంతి ప్రయత్నాలను మరింత దెబ్బతీస్తున్నందున, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం అమెరికాతో కుదిరే తుది ఒప్పందంలో భాగంగా ఉండాలని ఇరాన్ అంటోంది.