Prakash Raj Votes | ఓటర్ల జాబితాలో పారదర్శకత పాటించాలి..

Prakash Raj Votes | ఓటర్ల జాబితాలో పారదర్శకత పాటించాలి..

Prakash Raj Votes | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాలుగు రాష్ట్రాల్లో ఓటరు కార్డులు ఉన్నాయన్న అంశంపై బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. నటుడు ప్రకాశ్ రాజ్ కు నాలుగు రాష్ట్రాల్లో ఓటరు కార్డులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆయన పేరు ఏడేళ్లుగా ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు.

అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లను ఏకపక్షంగా తొలగించడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో పేర్లు తొలగించే ముందు ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ముఖ్యంగా ఒక నియోజకవర్గంలో 2 శాతానికి మించి ఓట్లు తొలగించే సందర్భంలో ప్రతి ఓటరుకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడంతో పాటు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని కవిత ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కులను పరిరక్షించేలా ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఆమె కోరారు.