అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ లలో ఖాళీగా ఉన్న కార్యకర్త, అంగన్వాడి సహాయకులు (ఆయా) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిందని రూరల్ సిడిపిఓ ఉమా శంకరమ్మ పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ లో ప్రభుత్వ ఉత్తర్వులను మీడియాకు తెలియజేశారు. సిడిపిఓ మాట్లాడుతూ జిల్లాలోని 11 ప్రాజెక్టులలో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 12 అంగన్వాడీ సహాయకురాలు (ఆయా) పోస్టులు 227 మొత్తం 239 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
దరఖాస్తు చేసుకునే మహిళలు వివాహితులు అయి స్థానికంగా గ్రామంలోనే నివాసం ఉండాలి.అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను. 01 జులై 2025 నాటికి దరఖాస్తు చేసే అభ్యర్థులు వయసు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ ప్రాంతంలో గల ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 21 సం.లు నిండిన వాళ్ళు లేకపోతే 18 సం.లు నిండిన వాళ్ళు కూడా అర్హులే.
అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకులు పోస్టుల కొరకు ఎస్సీ ఎస్టీ హాబిటెషన్స్ నందు ఉండే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.నెల జీతం అంగన్వాడి కార్యకర్తకు రూ.11500, అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000 ప్రభుత్వం ఇస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కులం ధ్రువీకరణ పత్రం (ఎస్సీ ఎస్టీ బీసీ) నివాసము పుట్టిన తేది పదవ తరగతి మార్క్స్ మెమో ఆధార్ వికలాంగత్వంనకు సంబందించిన పత్రములను గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి దరఖాస్తుకు జత చేయాలి.
అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి.దరఖాస్తులో ఇటీవల తీయించుకున్న ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయాలి. పోస్టుల ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయంలో సంప్రదించవలెను. లేదా అనంతపురం జిల్లా అధికారిక వెబ్ సైట్ https://ananthapuramu.ap.gov.in ను చూసుకోవాలన్నారు. ఖాళీల విషయంలో మార్పులు చేర్పులు ఉండవచ్చును. ఏ సమయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము జిల్లా కలెక్టర్ కు కలదని గమనించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పది రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. అంటే ఈనెల 11వ తేదీ ఆఖరు తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాప్తాడు సూపర్వైజర్లు లీలావతి శ్రావణి అంగన్వాడి టీచర్లు ఉన్నారు.
