unemployed arrest | పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద ఉద్రిక్తత

unemployed arrest | పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద ఉద్రిక్తత

ముట్టడికి యత్నం.. అరెస్టు చేసిన పోలీసులు

unemployed arrest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పోలీస్ ఉద్యోగాల భర్తీకి మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగులు హైదరాబాద్‌లోని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీస్ కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 5,000 పోస్టుల నుంచి 20,000 పోస్టులకు పెంచాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోలీస్ పోస్టులను భర్తీ చేయాలని నినాదాలు చేశారు.

ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొందరిని బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లోకి ఎక్కించిన దృశ్యాలు అక్కడ ఉద్రిక్తతకు దారితీశాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.