ఎస్టేట్, టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పనితీరు అద్వాన్నం.

వైసిపి సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ఎస్టేట్, టౌన్ ప్లానింగ్ పనితీరు చాలా అద్వాన్నంగా ఉందని వైసిపి సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.సెంట్రల్లో వీఎంసీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపణల నేపధ్యంలో మల్లాది విష్ణు వైసీపీ శ్రేణులతో కలసి కండ్రికలో పర్యటన చేశారు. కామన్ స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులతో కలసి ఆయన అరా తీశారు.

సంబందిత టౌన్ ప్లానింగ్ అధికారులతో విష్ణు మాట్లాడారు. రోడ్డుకు ఆక్రమించి మట్టిని తొలడాన్ని బట్టి వీఎంసీ స్థలం కబ్జాకు గురి అయ్యిందని ఆరోపణలలో బలం లేదని, ప్రైవేటు స్థలానికి సంబంధించిన వ్యక్తి తన స్థలానికి గిట్టుబాటు ధర రావాలని రోడ్డుకు మెరకు చేయించారని టౌన్ ప్లానింగ్ సిబ్బంది తెలియజేశారు. ఐతే ఇక్కడ కాకుండా సెంట్రల్లో మరికొన్ని చోట్ల వీఎంసీ స్థలాలు ఆక్రమాలకు గురి అయ్యాయని ఆయన ఆరోపించారు. వడ్డెర కాలనీ ప్రాంతంలో, సుందరయ్య నగర్, ఇందిరా నాయక్ నగర్,ఆంధ్ర ప్రభ కాలనీ నాల్గవ లైన్, ఫైన్ ఆపిల్ బిల్డింగ్ ఎదురు, బుడమేరు ఆక్రమణలు గురి అవుతున్నా, ఇందిరా నాయక్ నగర్లో నిబంధనల కు విరుద్ధంగా చికెన్ మటన్ షాపులు నిర్వహించడం, దాని వ్యర్దాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అటువంటి వాటిని కూడా టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.అలాగే వీఎంసీ కల్యాణ మండపాలు కూటమి నాయకుల చెప్పు చేతల్లోకి వెళ్లాయని, కల్యాణ మండపాలకు ఇష్టమొచ్చిన ధరలకు అద్దెకు ఇస్తూ జేబులు నింపుకొంటున్నారని అన్నారు. ఈ విషయంలో ఎస్టేట్ శాఖకు వైఫల్యం ఉందని అన్నారు. కోర్టులు కూడా లేఅవుట్లో ప్రజల అవసరతలు నిమిత్తం ఏయే వాటిని నిర్మించవచ్చో స్పష్టంగా తెలపడం జరిగిందని అన్నారు. వెంటనే సంబందిత అధికారులు స్పందించాలని లేకుంటే వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి పసుపులేటి ఏసు, వై. శ్రీరాములు, ఇస్మాయిల్,మన్నెం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.