venezuela earthquake | నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా…
venezuela earthquake | నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా…
venezuela earthquake | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈ ప్రకృతి విపత్తులో 1,400 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
అయితే, లా గువైరా ప్రాంతంలో కూలిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఓ బాలుడు నాలుగు రోజుల తర్వాత కూడా ప్రాణాలతో ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. నిరంతర సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా, ఈ భూకంప విషాదంలో అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లుకాస్ ట్రెజో కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఆయన భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఈ విపత్తులో మృతి చెందినట్లు సమాచారం. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, శిథిలాల కింద మరెవరైనా చిక్కుకుని ఉన్నారా అనే కోణంలో గాలింపు కొనసాగుతోంది.
