డల్లాస్ లో టెక్ స్టార్ ఐ.టీ కంపెనీ సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

డల్లాస్ లో టెక్ స్టార్ ఐ.టీ కంపెనీ సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

తొర్రూరు, ఆంధ్రప్రభ : అమెరికాలోని డల్లాస్ లో మన వరంగల్ బిడ్డలు అశోక్, రఘు చిట్టీమల్ల స్థాపించిన టెక్ స్టార్ ఐటీ కంపెనీని వారి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. అనంతరం వారితో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఏ దేశంలో ఉన్నా మన తెలంగాణ బిడ్డలు అన్ని రంగాలలో ముందు ఉంటారని, మీరు స్థాపించిన ఈ సంస్థ అమెరికాలో పలు బ్రాంచులు, స్వంత భవనాలలో ఉండటం, అలాగే హైదరాబాద్ లో కూడా మీ బ్రాంచులు ఉండటం మన తెలంగాణాకి ముఖ్యంగా మన వరంగల్ కి గర్వకారణం అని సంతోషం వ్యక్తం చేశారు.

మీ కంపెనీలో సుమారు 1500 వందల మంది ఈ బ్రాంచ్ లో పని చేయటం అందులో 500 వందల మంది మన వరంగల్ బిడ్డలకి ఉద్యోగ అవకాశం కల్పించటం చాలా సంతోషకరం అంటూ అభినందించారు. మీరు ఇలానే మన తెలంగాణ నుండి వచ్చే మన వారికి మరిన్ని ఉద్యోగ అవకాశలు కల్పించి వారికి అండగా ఉండాలన్నారు. తెలంగాణలో రానున్నది మన ప్రభుత్వమే అని మళ్ళీ మన ముఖ్యమంత్రిగా కెసిఆర్ అని విశ్వాసాన్ని వ్యక్తం చేసి, మీకు అన్ని విధాలుగా అండగా కెసిఆర్ మేము ఉంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త అజయ్ కాల్వాల, పలు ఐటీ కంపెనీ సీఈఓలు పాల్గొన్నారు.