SIR List | భయంతో వ్యక్తి ఆత్మహత్య
SIR List | భయంతో వ్యక్తి ఆత్మహత్య
SIR List | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భరత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీబర్ రహ్మన్ (51) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేరు లేకపోవడం వల్ల తనకు ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న భయంతో కొంతకాలంగా మానసికంగా కలత చెందుతున్నట్లు వారు పేర్కొన్నారు.
రహ్మన్‌కు ముగ్గురు పిల్లలు ఉండగా, వారిలో ఇద్దరు మానసిక వికలాంగులని, వారి భవిష్యత్తుపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య ధైర్యం చెప్పినా ఆయన మనస్తాపం నుంచి బయటపడలేకపోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
