అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • ఘనంగా జాతీయ అగ్నిమాపక సేవల దినోత్సవం వేడుకలు
  • అగ్నిమాపక మాస్ డ్రిల్లింగ్
  • యాదాద్రి భువనగిరి జిల్లా ఫైర్ అధికారి మధుసూదన్ రావు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రావు తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని దివిస్ పరిశ్రమలో జాతీయ అగ్నిమాపక సేవల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అగ్రి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి సిబ్బందికి మాస్ డ్రిల్లింగ్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ జీఎం బాలకిషోర్, ఈ హెచ్ ఎస్ ఏజీఎం ఎం సాంబశివరావు, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శివాజీ, దివిస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, భద్రత అధికారులు కే ఉమా మహేష్, ఎల్ రంగారావు, ఎన్ వి డి ప్రసాద్, భద్రత సిబ్బంది, పరిశ్రమ ఉద్యోగులు గోపి తదితరులు పాల్గొన్నారు.