నచ్చన్ ఎల్లాపూర్ లో బడిబాట..

కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న ఆధ్వర్యంలో జెడ్ పి ఎస్ ఎస్ లింగాపూర్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు జి నర్సయ్య నిర్వహించిన బడిబాట కార్యక్రమం గ్రామంలో విద్యా చైతన్యాన్ని పెంపొందించేలా జరిగింది. గ్రామంలోని వీధులలో తిరుగుతూ విద్యార్థులను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాల గురించి వివరించారు. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, బాల కార్మిక వ్యవస్థకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరారు. ఉపాధ్యాయుడు నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాలలో నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ దేవా, గ్రామస్తులు నర్సయ్య, రాజు తదితరులు పాల్గొని బడిబాట కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా కార్యక్రమానికి మంచి స్పందన తెలియజేసి విద్యాభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు.

Leave a Reply