పట్టణంలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే

ప్రముఖ వైద్యులు సిరంగి సంతోష్ కుమార్‌కు సన్మానం

పరకాల, ఆంధ్రప్రభ : జాతీయ డాక్టర్స్ డే పురస్కరించుకుని పట్టణంలోని బీజేపీ నాయకులు ప్రముఖ వైద్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సేవా ధర్మంగా భావిస్తూ ప్రజలకు నిస్వార్థ వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు సిరంగి సంతోష్ కుమార్ సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఎందరో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, పలు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే వైద్య సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న డాక్టర్ సంతోష్ కుమార్ సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరిన్ని ఆరోగ్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ కు జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.