వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం
మోత్కూరు, ఆంధ్రప్రభ: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర కాలనీలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాలుగో వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వేర్వేరుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు.
వేద పండితుల ఆధ్వర్యంలో శాంతిపాఠం, వేదవిన్నపాలు, మూర్తి కుంభారాధన, హోమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యేలను శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు సోలిపురం చంద్రారెడ్డి, అధ్యక్షుడు ముప్ప వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఏలే ఉప్పలయ్య, దామెర స్వాతి, ప్రధాన కార్యదర్శి గుండా మల్లేశం, కోశాధికారి అమనగంటి వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి ముప్ప తిరుమల్‌రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
