మరికాసేపట్లో రైతు భరోసా నిధుల విడుదల..

  • రాష్ట్ర రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగం
  • శిల్పకళా వేదికలో ప్రారంభం కానున్న కార్యక్రమం..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రైతులకు వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి, రైతులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల అనంతరం రాష్ట్రంలోని రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.