LIVE | మాట నిలబెట్టుకున్న సీఎం.. రైతు భరోసా నిధుల విడుదల
- బటన్ నొక్కిన సీఎం రేవంత్
- తొలి విడతలో 44.28 లక్షల మంది రైతులకు లబ్ధి
- రైతు ఖాతాల్లో రూ.2,482 కోట్ల జమ
- శిల్పకళా వేదికలో నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- వానాకాలం సాగుకు అండ..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఎన్నికల హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం జమ చేసింది రేవంత్ సర్కారు. వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ఈ నిధులు రైతులకు అందనున్నాయి.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని, రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యున్నతి, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
