రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీ.. దర్యాప్తు మరింత విస్తరణ
- సమగ్ర విచారణ కోరుతూ ఈడీకి అయోధ్య పోలీసుల లేఖ..
- సిట్‌కు మరో 15 రోజుల గడువు..
- నిధుల లావాదేవీలపై ఫోకస్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామమందిర విరాళాల మోసం కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, మనీలాండరింగ్ కోణంలో సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ అయోధ్య పోలీసులు ఈడీకి లేఖ రాసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు మరో 15 రోజుల గడువు లభించింది. కేసులోని అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించేందుకు, దర్యాప్తు పరిధిని విస్తరించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. విరాళాల పేరుతో సేకరించిన నిధులు ఏం చేశారు, డబ్బు బదిలీల్లో అక్రమాలు జరిగాయా, సంబంధిత చట్టాల ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. ఈడీ అధికారికంగా కేసు నమోదు చేస్తే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు మరింత విస్తరించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
