పీఎస్‌ఆర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

మోత్కూర్, ఆంధ్రప్రభ: ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఫైళ్ల పుష్పలత–సోమిరెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్ గోపిరెడ్డి ఏర్పాటు చేసిన నూతన పీఎస్‌ఆర్ ఆసుపత్రిని బుధవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులు 24 గంటల వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా పనిచేయాలని సూచించారు. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా వైద్యులు సేవాభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న–సోమనర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల–వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు డా. గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.