బీజేపీ కడెం మండల అధ్యక్షుడిని పరామర్శించిన ఎంపీ నగేష్

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ కడెం మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్‌ను అదిలాబాద్ ఎంపీ జి. నగేష్ పరామర్శించారు.
ప్రస్తుతం వైద్య చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనివాస్ యాదవ్‌ను ఎంపీ నగేష్ శుక్రవారం ఉడుంపూర్ గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
