Russia-Ukraine-War : రష్యా ఉక్కిరి బిక్కిరి Andhra Prabha Top Story
Russia-Ukraine-War : రష్యా ఉక్కిరి బిక్కిరి Andhra Prabha Top Story
- ఉక్రెయిన్ డ్రోన్ల దూకుడు
- యుద్ధ విరమణే అపలు టార్గెట్
- అందుకే రష్యాపై వత్తిడి… ఉక్రెయిన్ వెల్లడి
- ఉపగ్రహ కేంద్రం దబ్నా ధ్వంసం
- వరుసగా రెండో సారి దాడి
- రష్యా భూభాగంలో 419 డ్రోన్ల విధ్వంసం
( ఆంధ్రప్రభ, కీవ్స్ ప్రతినిధి )

నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఎక్రెయిన్ ఒత్తిడి పెంచుతోంది. తమ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించిన వారం రోజుల్లో సుదూర డ్రోన్ దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే రష్యా అతిపెద్ద ఉపగ్రహ సమాచార కేంద్రాలపై ఫోకస్ పెంచింది. ఈ ఉపకగ్రహ కేంద్రంపై రెండోసారి దాడి చేసినట్లు ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. మాస్కోకు ఉత్తరాన, ఉక్రెయిన్ సరిహద్దుకు సుమారు 500 కిలోమీటర్ల (310 మైళ్ల) దూరంలోని డబ్నా ఉపగ్రహ సమాచార కేంద్రాన్ని, గూఢచార సేకరణకు రష్యా సాయుధ దళాల సమన్వయానికి ఉపయోగిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.
Russia-Ukraine-War : ఓ పసికందు మృతి

డబ్నా సమాచార కేంద్రంపై దాడి జరిగినట్లు రష్యా ధృవీకరించనప్పటికీ, పట్టణంలోని ఒక “పరిపాలనా భవనం”పై డ్రోన్ దాడి జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మాస్కో గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ తెలిపారు. మాస్కోకు ఆగ్నేయంగా యెగోరియెవ్స్క్‌లో మంగళవారం ఒక డ్రోన్ ఇంటిపై పడటంతో, శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోగా.. ఆరు నెలల పసికందు మరణించిందని వోరోబ్యోవ్ వివరించారు. ఇద్దరు పెద్దలను, ఇద్దరు పిల్లలను . సహాయక సిబ్బంది బయటకు తీశారని, ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే ఆ పసికందు మరణించిందని వోరోబ్యోవ్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపారు.
మరోచోట, రష్యాలోని పశ్చిమ ట్వెర్ ప్రాంతంలో, కూల్చివేయబడిన ఒక “శత్రు డ్రోన్” ఒక నివాస వేసవి ఇంటిని ఢీకొనడంతో 61 ఏళ్ల మహిళ మరణించినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. రష్యా రాజధాని వైపు సోమవారం రాత్రి నుంచి పలు దఫాలుగా డ్రోన్లు దాడి జరుగుతోందని, రష్యా వైమానిక రక్షణ దళాలు 60కి పైగా డ్రోన్లను కూల్చివేశాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. మొత్తం మీద, 419 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Russia-Ukraine-War : రష్యా రాజధాని టార్గెట్ గా…

రష్యా భూభాగంలోకి మరింత లోతుగా చొచ్చుకెళ్లి, ప్రధానంగా చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా, అలాగే రష్యా రాజధాని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లలో భారీస్థాయి డ్రోన్ దాడులు నిర్వహించడం ద్వారా ఉక్రెయిన్ క్రెమ్లిన్‌పై ఒత్తిడిని పెంచుతోంది. యుద్ధం నెమ్మదిగా తమ సరిహద్దుల వరకు విస్తరిస్తుండటంతో కొంతమంది రష్యన్లు పెరుగుతున్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించేలా రష్యాపై “ఒత్తిడి” తీసుకురావడమే లక్ష్యంగా గత వారం జెలెన్స్కీ 40 రోజుల ఆపరేషన్‌ను ప్రకటించారు. “శత్రువు దట్టమైన వాయు రక్షణ వ్యవస్థలో ఉన్న ఒక ఖాళీ మార్గం” కారణంగానే మాస్కో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లపై దాడులు సాధ్యమయ్యాయని ఉక్రెయిన్ సైన్యం మంగళవారం తెలిపింది.
Russia-Ukraine-War : క్రెమ్లినన్ ఉక్కిరి బిక్కిరి
రాజధాని వైపు గగనతలాన్ని పర్యవేక్షించే బ్రయాన్స్క్ రష్యా సరిహద్దు ప్రాంతంలోని రాడార్లను ఉక్రెయిన్ సైనిక సిబ్బంది “క్రమపద్ధతిలో ధ్వంసం” చేస్తున్నారని కూడా అది పేర్కొంది. జూన్ 22న ఉక్రేనియన్ సైన్యం డబ్నా ఉపగ్రహ సమాచార కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించిన తర్వాత, కీవ్ ఆ కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించడం ఇది రెండవసారి. ఆ ఘటనలో తమపై “భారీ డ్రోన్ దాడి” జరిగిందని, అయితే సమాచార, టెలివిజన్ ప్రసారాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ నివేదించింది. మాస్కో ప్రాంతంలో జరిగిన ఈ దాడికి కీవ్‌ను క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, “సామాన్య ప్రజలు బాధపడుతున్నారు, పిల్లలు చనిపోతున్నారు” అని ఆయన అన్నారు.
