Petrol Price | లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు
Petrol Price | లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు
Petrol Price |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల పెరిగిన ఇంధన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.183 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 19కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.183.50కి తగ్గించడంతో రూ.2,930కి దిగి వచ్చింది. ముడిచమురు సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో ఈ ధరల సవరణ చేపట్టినట్లు సమాచారం.
ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు సరఫరాపై ప్రభావం పడటంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుతుండటంతో వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గించింది. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు కొంత మేర ఉపశమనం లభించనుంది.
మరోవైపు ప్రైవేటు రంగ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ కూడా వినియోగదారులకు ఊరటనిస్తూ పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ధర తగ్గింపును ప్రకటించింది. జూలై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా పెట్రోల్ బంకుల్లో అమలు కానున్నాయి. ఇంధన ధరల తగ్గుదలతో రవాణా ఖర్చులు కొంత మేర తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

