Breaking | ఓఆర్ఆర్‌పై కాల్పుల కలకలం.. ఎగ్జిట్-8 వద్ద ఉత్కంఠ !
- మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిపై పోలీసుల ఫైరింగ్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై మంగళవారం రాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్-8 సమీపంలో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. సదరు నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
