Pawan | గోదావరి కాలుష్య నియంత్రణపై సమీక్ష

Pawan | గోదావరి కాలుష్య నియంత్రణపై సమీక్ష

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మనకు జీవితాన్ని ఇచ్చే నదులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, గోదావరి నది కాలుష్య నియంత్రణ అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

గోదావరి, కృష్ణా నదులను భవిష్యత్ తరాల కోసం పరిరక్షించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వచ్చే ఆరు నెలల్లో నదుల పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులను ఆదేశించారు. నదుల రక్షణ కోసం ఇవాళ్టి నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఆక్వా పరిశ్రమల వ్యర్థాల వల్ల నదులు, కాలువలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి పరిశుభ్రమైన నదీ వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.