మహిళా నాయకురాలి నామినేషన్ తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం
మహిళా నాయకురాలి నామినేషన్ తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం
- రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నాటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆమెకు ఎటువంటి నోటిసు లేకుండా, ఏ కేసులోను హాజరుకాకుండా, తనపై అసలు కేసు ఉందనే విషయమే తెలియని పరీస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్ లో ఆ కేసు గురించి పేర్కోనలేదనీ, ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాలలో భాగంగానే ఎన్నికల నామినేషన్ల స్కూటీనీలో ఆమె నామినేషన్ ను తిరస్కరించిందనీ మండిపడ్డారు.
గాంధేయవాదిగా, చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఒక సుశిక్షితురాలిగా ఎదిగిన ఆమె నామినేషన్ ను తిరస్కరించడం తీవ్రమైన రాజకీయ అప్రజాస్వామ్య చర్య అని నిప్పులు చెరిగారు. మహిళాల గౌరవం గురించి మాట్లాడే, మహిళాలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి “బేటీ బచావో- బేటి పఢావో” అని నినాదించే బీజేపీ ఒక మహిళ నాయకురాలి నామినేషన్ ను ఇలా తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
