ఈనెల 27న రెడ్‌క్రాస్ వార్షిక సర్వసభ్య సమావేశం

జీవిత సభ్యులు, కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలి: డాక్టర్ జి. సమరం

విజయవాడ, ఆంధ్రప్రభ: భారత రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 27వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ జి. సమరం తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం జరుగుతుందని ఆయన వెల్లడించారు. సమావేశంలో జిల్లా రెడ్‌క్రాస్ శాఖ చేపట్టిన సేవా కార్యక్రమాలు, వార్షిక నివేదిక, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

రెడ్‌క్రాస్ సొసైటీ జీవిత సభ్యులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, అర్హులైన సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరై సమావేశ కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ జి. సమరం విజ్ఞప్తి చేశారు.