రాయితీపై పత్తి విత్తనాల పంపిణీ

మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పులిపలుపుల గ్రామంలోని రైతు వేదికలో కాటన్ కంపాస్ “కాంతి” పథకం కింద రైతులకు 100 శాతం రాయితీపై పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు సహాయ వ్యవసాయ సంచాలకులు వేణుగోపాల్, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొటీ నారాయణ రైతులకు విత్తనాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన పత్తి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ పథకం ద్వారా క్లస్టర్ పరిధిలోని తొమ్మిది గ్రామాల రైతులకు 50 హెక్టార్ల విస్తీర్ణానికి సరిపడా విత్తనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పులిపలుపుల సర్పంచ్ కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు, గూడపూర్ సర్పంచ్ నన్నూరి భూపతి రెడ్డి, బీరెల్లిగూడెం సర్పంచ్ దాసరి గోవర్ధన్, జమస్థాన్‌పల్లి సర్పంచ్ అందుగుల నరసమ్మ యాదయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి మాధగోని నరసింహ, రైతులు బొలుగురి నరసింహ, జిల్లా వెంకటేశం, ఇరిగి యాదయ్య, నకెరికంటి నరసింహ, సువర్ల పాపయ్య, పంతంగి లక్ష్మయ్య, బాలరాజు రమేష్, కట్ట సంతోష్, ఖమ్మంపాటి పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.